విశాఖ జిల్లాలో ప్రధాన జలాశయాలైన రైవాడ, పెద్దేరులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వరద నీటిని జలాశయాల గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. పెద్దేరు జలాశయానికి ఇన్ ఫ్లో 623 క్యూసెక్కులు వస్తుండగా... గేట్లు ఎత్తి 503 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నట్లు ఏఈ సుధాకర్ రెడ్డి చెప్పారు.
దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి ఇన్ ఫ్లో 525 క్యూసెక్కులు వస్తుండగా.. 375 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తునన్నట్లు డీఈఈ మాధవి తెలిపారు.
ఇదీ చదవండి