విశాఖ మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్ట మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. కొండవాగు ప్రాంతంలో మత్స్య గడ్డ పొంగి ప్రవహిస్తోంది. జి.మాడుగుల మండలం బొయితలి పంచాయతీ తోకగరువులో కురుస్తున్న వర్షానికి భారీ జీలుగు చెట్టు పెద్ద మల్లన్న అనే రైతు ఇంటి మీద పడింది. ఆ ఇంట్లో వారంతా ఆ సమయంలో బయట పని చేస్తుండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. చెట్టు ఇంటిపై పడటంతో... ఇంటి పైకప్పు, గోడలు ధ్వంసమయ్యాయి. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు రైతు ఇంటిని సందర్శించి వారికి ఆర్థిక సహాయం అందించారు.
ఇదీ చదవండి: