గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో డుడుమ జలాశయం నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. 2,590 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న డుడుమలో.. ప్రస్తుతం 2585.70 అడుగులకు నీటిమట్టం పెరిగింది.
ఇది ఇలా ఉండగా భారీ వర్షాల కారణంగా ముంచంగిపట్టు మండలంలోని రూడకోట వద్ద కల్వర్టు కూలిపోయింది. లక్ష్మీపురం పంచాయతీకి సమీపంలో బిరిగూడ వద్ద నది పొంగడంతో...లక్షీపురం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: