విశాఖ జిల్లా అనకాపల్లిలో కురుస్తున్న భారీ వర్షాలకు శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నది నిండుకుండలా దర్శనమివ్వటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు కాలం మెుదలైనా నదిలో కనిష్టస్థాయిలో నీటి ప్రవాహం లేక రైతులు పంటలు వేయటం కష్టమనుకున్న తరుణంలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఆనందంగా మెుదలు పెడుతున్నారు. తాగు, సాగు నీటికి ఇబ్బందులు తొలగిపోయాయని సమీప గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : విశాఖ పోలీసులకు చిక్కిన తమిళనాడు గంజాయి ముఠా