విశాఖ జిల్లా రోలుగుంట రావికమతం మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలపై విరిగిన చెట్ల కొమ్మలు పడటంతో రోలుగుంట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా రోలుగుంట, కొవ్వూరు, కొత్తకోట, కొమరవోలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాడుగుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్ ఆత్మహత్యాయత్నం