విశాఖ జిల్లా పాయకరావుపేటలో భారీ వర్షం కురిసింది. పాయకరావుపేట బస్టాండ్ ప్రాంగణమంతా బురదమయంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం పడుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో వార్షం కురిసింది. పలు మండలాల్లో కురిసిన వానకి... వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హంద్రీ నదిలో వరద ప్రవాహం పెరిగింది. కడప జిల్లా రాయచోటిలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా... ఈ తొలకరి వర్షం సాగు పనులకు మేలు చేస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి దాడి