ETV Bharat / state

బోరు నుంచి వేడి నీళ్లు.. చూసేందుకు తరలివస్తున్న ప్రజలు - madugula news

విశాఖ జిల్లా మాడుగుల మండలం చింతలూరులో ఓ ఇంట్లో ఉన్న బోరు మోటారు నుంచి వేడి నీళ్లు వస్తున్నాయి. విషయం గ్రామస్థులకు తెలియడంతో చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఐదు రోజులుగా వేడి నీళ్లు వస్తున్నట్లు ఇంటి యజమాని చెబుతున్నాడు.

heat water bore
heat water bore
author img

By

Published : Jun 15, 2021, 5:46 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని చింతలూరులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గూడెపు దేముడు తన నివాసంలో నాలుగేళ్ల క్రితం తాగునీటి కోసం ఇంట్లో బోరు బావి తవ్వించాడు. ఈ బోరు నుంచి ఐదు రోజులుగా వేడి నీళ్లు వస్తున్నాయి. మొదటి రోజు.. మోటరులో ఏదో సమస్య తలెత్తిందని భావించారు. కానీ ఐదురోజులుగా వేడి నీళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గ్రామస్థులు అది చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మెకానిక్​ను తీసుకొచ్చి చూపించామని.. మోటారులో సమస్య లేదని చెప్పాడని ఇంటి యజమాని తెలిపాడు.

ఇదీ చదీవండి: vishakha steel protest: అఖిల పోరాట సమితికి మేయర్ సంఘీభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.