ETV Bharat / state

వ్యాయామశాలలపై కరోనా పిడుగు.. ఆదుకోవాలంటూ నిర్వాహకుల వినతి

author img

By

Published : May 20, 2021, 1:54 PM IST

కరోనా మహమ్మారి.. వ్యాయామశాలలపై తీవ్ర ప్రభావమే చూపింది. కొవిడ్ మొదటి దశ మిగిల్చిన నష్టం నుంచి కోలుకుంటున్న సమయంలోనే.. సెకండ్‌ వేవ్‌ ప్రబలటం.. జిమ్‌ నిర్వాహకులపై బండ పడినట్లయింది. కర్ఫ్యూ అమలుతో ఉపాధి కోల్పోయామని జిమ్‌ యజమానులు వాపోతున్నారు.

gym closed in Corona second wave
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మూతపడ్డ జిమ్​లు

కొవిడ్‌ ప్రభావంతో ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు, శరీర సౌష్టవం పెంచుకునేందుకు.. జిమ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కరోనా మొదటి దశ తర్వాత జిమ్‌లకు తాకిడి పెరిగింది. ఆర్థికంగా కాస్త మెరుగుపడుతున్నామని భావిస్తున్న సమయంలో మళ్లీ ముంచుకొచ్చిన రెండో దశ కొవిడ్‌... జిమ్‌ నిర్వాహకులపై పిడుగులా పండింది. కర్ఫ్యూ అమలుతో వ్యాయమశాలలు మూతపడ్డాయి.

విశాఖ నగరంలో వందలాది జిమ్‌లు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేక జిమ్‌లు నడుస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి అధునాతన పరికరాలు కొనుగోలు చేసిన నిర్వాహకులు.. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూతో ఉపాధి కోల్పోయారు. బ్యాంకు రుణాలు కట్టలేక, నిర్వహణ ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యాయామశాలల యజమానులు కోరుతున్నారు. కనీసం కర్ఫ్యూ నుంచి జిమ్‌లకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి:

విశాఖ: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.