ETV Bharat / state

విశాఖ ఏయూలో 'గురజాడ భాష' గ్రంథం ఆవిష్కరణ

author img

By

Published : Sep 21, 2022, 8:44 PM IST

Andhra University: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆచార్య వెలమల సిమ్మన్న రచించిన 'గురజాడ భాష' గ్రంథాన్ని ఆవిష్కరించారు.

Gurjada language book released
గురజాడ భాష గ్రంథం ఆవిష్కరణ

Gurajada Apparao Birth Anniversary: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ మందిరంలో గురజాడ అప్పారావు 160వ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు శాఖాధిపతి ఆచార్య జరా అప్పారావు అధ్యక్షత వహించగా.. విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య బాలమోహన్​దాస్​, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య వెలమల సిమ్మన్న రచించిన గురజాడ భాష గ్రంథాన్ని ఆవిష్కరించారు. గురజాడ ఆధునిక తెలుగు సాహిత్యానికి గురువు అని ఆచార్య సిమ్మన్న అన్నారు. వాడుక భాషలో రచనలు చేసిన గురజాడ అప్పారావు యుగకర్త అని ఆయన అభివర్ణించారు. ప్రజల కోసమే తాను సాహిత్యాన్ని రచిస్తానని, ఎవరో కొద్దిమంది మెప్పు కోసం కాదని స్పష్టంగా వెల్లడించిన ప్రజాకవి గురజాడ అని అభిప్రాయపడ్డారు. గొప్ప మానవతావాదిగా, ప్రజా సాహితీవేత్తగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆగ్రస్థానంలో ఆయన నిలిచారని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.