విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుమ్మలరేవు పంచాయతీలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించేందుకు.. వీరు దారకొండ నుంచి ట్రాక్టర్‌పై వెళ్తుండగా.. కొంగ పాకల తాత్కాలిక కల్వర్టు వద్ద ట్రాక్టర్ ప్రవాహంలో చిక్కుకుంది.
భారీ వర్షాలకు కల్వర్టు పైనుంచి నీరు ప్రవహిస్తుండగా.. వరద ఉద్ధృతికి ట్రాక్టర్ మధ్యలోకి వెళ్లే సరికి ఒరిగిపోయి మట్టిలో కూరుకుపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురై.. రక్షించాలంటూ కేకలు వేశారు. సమీపంలోని గ్రామస్థులు అక్కడకు చేరుకుని వీరిని రక్షించారు. అనంతరం కాలినడకన గుమ్మిరేవుల చేరుకుని కార్యక్రమం నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చూడండి:
భారీ వర్షం.. వరద ప్రవాహం... పంట నష్టం... ఇదీ ప్రస్తుత చిత్రం