ETV Bharat / state

విశాఖలో రూ.2,954 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల తాకట్టు

అప్పులతో రాష్ట్రాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. విశాఖలోని ఆస్తులను తాకట్టు పెట్టింది. రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరిట 25 వేల కోట్ల రూపాయల్ని అప్పు తీసుకునేందు కోసం విశాఖలోని 13 ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం వివిధ బ్యాంకులకు తనఖా పెట్టేసింది. విశాఖ నగరంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న సర్క్యూట్ హౌస్ , సీతమ్మధార తహసిల్దార్ కార్యాలయం, ఆర్ అండ్ బీ క్వార్టర్స్ , గవర్నమెంటు పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ కాలేజీ తదితర ఆస్తుల్ని తనఖా పెట్టి పాతిక వేల కోట్ల అప్పు తీసుకున్నారు.

సీతామ్మధారలోని తహసీల్దార్ కార్యాలయం
సీతామ్మధారలోని తహసీల్దార్ కార్యాలయం
author img

By

Published : Oct 2, 2021, 4:29 AM IST

Updated : Oct 2, 2021, 12:55 PM IST

అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపేందుకు రాష్ట్ర వాణిజ్య రాజధాని విశాఖలోని రూ.2,954 కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న ప్రభుత్వ ఆస్తులను రాష్ట్రప్రభుత్వం తనఖా పెట్టేసింది. ఈ తనఖా ఒప్పందంలో ప్రభుత్వమే వాటి మార్కెట్‌ విలువను నిర్ధారించి పేర్కొంది. విశాఖలోని మొత్తం 13 ఆస్తులుగా ఉన్న 128.70 ఎకరాలను ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీ కంపెనీకి తనఖా పెట్టింది. ఈ మేరకు తనఖా రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసింది. ఆ భూముల్లో అనేక ప్రభుత్వ భవనాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇచ్చిన అన్ని బ్యాంకులకు ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీ కంపెనీ సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరిస్తోంది. కేవలం డాక్యుమెంట్ల సమర్పణ కాకుండా రిజిస్ట్రేషన్‌ కూడా చేయడం తాజా పరిణామం. ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌కు ఈ ప్రభుత్వ భూములను తొలిదశలో బదలాయించారు. తాజాగా రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ తరపున ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఎస్‌బీఐ ట్రస్టీ కంపెనీ తరఫున ఇమ్మాన్యుయేల్‌ ఏసురత్నం మధ్య ఈ తనఖా ఒప్పందం రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబరు 27న విజయవాడలోని సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం పూర్తిచేశారు. అప్పులు చెల్లించడానికి తిరిగి రుణాలు పొందాల్సిన పరిస్థితులు తలెత్తుతున్న క్రమంలో ఇన్ని విలువైన ఆస్తులను తనఖా రిజిస్ట్రేషన్‌ చేయడం చర్చనీ యాంశమవుతోంది.

విశాఖలో రూ.2,954 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల తాకట్టు

ఎందుకీ తనఖా రిజిస్ట్రేషన్‌?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రూ.21,500 కోట్ల రుణం తీసుకునేందుకు గతేడాది నవంబరులోనే ఎస్‌బీఐ క్యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ప్రభుత్వ గ్యారంటీల ఆధారంగానే కార్పొరేషన్లు రుణాలు తీసుకునేవి. ఇప్పుడు ఆ గ్యారంటీలు సరిపోవని ట్రస్టీ కంపెనీ అనేక నిబంధనలు విధించింది. ఈ రుణం తిరిగి ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నిస్తే అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించి రాష్ట్రంలోని 10 మద్యం డిపోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖజానాకు మళ్లించి అక్కడి నుంచి ఆ మొత్తం బదిలీ అయ్యేలా ఏర్పాటుచేసింది. దీనిపై కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగం సైతం రాష్ట్రానికి లేఖ రాసింది. రుణం సమకూర్చిన ఎస్‌బీఐ రుణం విలువలో 10% మొత్తానికి సమానమైన ఆస్తులు కార్పొరేషన్‌ పేరిట చూపించాలని నిబంధన విధించింది. దీంతో విశాఖపట్నంలోని విలువైన ఆస్తులను ప్రభుత్వం కార్పొరేషన్‌కు బదలాయించింది. డాక్యుమెంట్ల స్వీకరణతో సరిపెట్టుకోకుండా ఈ ఆస్తుల తనఖా ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్‌ చేయాలనడంతో తాజాగా ఆ ప్రక్రియ పూర్తిచేసినట్లు సమాచారం.

రూ.25వేల కోట్ల రుణ ఒప్పందం

ఏపీఎస్‌డీసీ ద్వారా రూ.25,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే రూ.21,500 కోట్ల అప్పులు ప్రభుత్వం తీసుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్ల రుణం తీసుకున్నారు. తర్వాత ఈ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తొలుత భూ పరిపాలన కమిషనర్‌కు బదలాయించారు. తర్వాత ఏపీ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆమోదం పొంది రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించారు. ఈ డాక్యుమెంట్లు విశాఖ బ్యాంకు అధికారులకు ఇచ్చాక మరో రూ.3,000 కోట్ల రుణం తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.17,000 కోట్లు ఈ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది.

ఫీజు మినహాయింపు

ఈ రిజిస్ట్రేషన్‌ ఒప్పందానికి ఫీజు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న రుణమొత్తంలో 1% ఫీజుగా వసూలు చేయాలి. ఆ విలువ దాదాపు రూ.250 కోట్లు.

.

ఇదీ చదవండి:

2021-22 నూతన మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం

Last Updated : Oct 2, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.