విశాఖ జిల్లా అనకాపల్లిలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 40 నిరుపేద కుటుంబాలకు 30 వేల విలువచేసే సరకులను అందజేసినట్లు భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పి. నిర్మల తెలిపారు.
రైల్వే స్టేషన్ వద్ద అన్నా క్యాంటీన్ వద్ద నిరాశ్రయులకు భోజన వసతి కల్పించారు. గత నెల 18 నుంచి నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేస్తున్నట్లు భారత్ వికాస్ పరిషత్ సభ్యులు కొణతాల రమణ అప్పారావు తాటికొండ రాజా రావు, ఎస్ గోపాలరావు రావు తెలిపారు.
ఇదీ చూడండి: