విశాఖ జిల్లా మునగపాక మండలం గొల్లలపాలెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన అభ్యర్థిని కాకుండా వేరేవారిని సర్పంచ్‌గా గెలిపించామనే కోపంతో... ఎలమంచిలి ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో 1987లో తమకు పట్టాలు ఇచ్చారని, ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటుంటే.. ప్రొక్లెయిన్లతో తొలగించడం దారుణమన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా.. గొల్లలపాలెంలో ఎలాంటి పట్టాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కడుతున్నారని.. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. మునగపాక తహసీల్దార్ మురళీకృష్ణ చెప్పారు.
ఇవీ చూడండి...