ETV Bharat / state

ఘనంగా గోదా రంగనాధుల కల్యాణం - రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గోదా రంగనాధుల కల్యాణం

రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో భక్తులు శ్రీ రంగనాథుని కి కళ్యాణం నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలకరించి వేడుకగా జరిపారు.

ఘనంగా గోదా రంగనాధుల కల్యాణం
ఘనంగా గోదా రంగనాధుల కల్యాణం
author img

By

Published : Jan 14, 2021, 6:25 AM IST

Updated : Jan 14, 2021, 1:40 PM IST

రాష్ట్రంలో పలు చోట్ల శ్రీ రంగనాథునికి కళ్యాణం నిర్వహించారు. ధనుర్మాస వేడుకల్లో భాగంగా వేద పండితులు ఈ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కోనసీమ

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథల కల్యాణాన్ని అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలోకి స్వామి, అమ్మవార్ల విగ్రహాలను డప్పు వాయిద్యాలతో ఊరేగింపు తీసుకు వచ్చారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణాల నడుమ స్వామి, అమ్మవార్ల వివాహనాన్ని ఘనంగా జరిపారు. అలాగే పండితులు కల్యాణ ఘట్టాన్ని విపులంగా వివరించారు.

బద్వేలు

కడప జిల్లా బద్వేలు అనంత రాజపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాస వేడుకల సందర్భంగా వేద పండితులు ఈ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు . ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్ని కళ్యాణాన్ని తిలకించారు.

విశాఖ
విశాఖలో గోదా రంగనాధుల కల్యాణం ఘనంగా జరిగింది. మాధవధార వద్ద ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ కల్యాణ వేడుక జరిగింది. ధనుర్మాసంలో జరిగే ఈ వేడుకకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఇవీ చదవండి

విశాఖ మన్యంలో మహిళ మృతదేహం కలకలం

Last Updated : Jan 14, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.