విశాఖ జిల్లా పాడేరు మండలం జి. ముంచంగిపుట్టు గ్రామానికి చెందిన పాంగి లక్ష్మీ ప్రసన్న(14).. సికిల్ సెల్ ఎనీమియా (రక్తహీనత) తో బాధపడుతూ మృతి చెందింది. విద్యార్థిని జి.మాడుగుల మండలం బంధ వీధి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని. పోషకాహారం అందని కారణంగానే బాలిక మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబీకులు చెప్పారు.
సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు నెలసరి పింఛన్ సైతం మంజూరు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారి ఇళ్లకే పోషకాహారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి: