ETV Bharat / state

194 కేజీల గంజాయి స్వాధీనం.. 6 గురు అదుపులో

ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని మాడుగుల పోలీసులు పట్టుకున్నారు.

గంజాయి
author img

By

Published : Aug 30, 2019, 6:43 AM IST

Updated : Aug 30, 2019, 7:20 AM IST

రవాణాకు సిద్ధంగా ఉంచిన గంజాయి స్వాధీనం

విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం జంపెన సమీపంలోని వంతెన వద్ద షెడ్​లో నిల్వచేసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. మాడుగుల పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు చేశారు. 194 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకి తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.

ఇది కూడా చదవండి.

విశాఖ నుంచి సింగపూర్​కి... ఇక స్కూట్​లో..!

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాంలో జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం రాజాం పట్టణంలో పాఠశాలల కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు . ఈ భారీ ర్యాలీలో రాజాం లోని ప్రభుత్వ ప్రైవేట్ ,పాఠశాల కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు క్రీడ కారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించాలని అన్నారు .విద్యార్థులు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు .భారతదేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను స్ఫూర్తితో విద్యార్థులు ,యువత క్రీడల్లో బాగా రాణించాలని అన్నారు .ఈ సందర్భంగా పలువురు సీనియర్ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.

Body:శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు

Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ , ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు
Last Updated : Aug 30, 2019, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.