విశాఖ జిల్లా దేవరాపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాలాబు -కోనాం మార్గంలో సుమారు 50 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 32 బస్తాల్లో నిల్వ చేసిన 640 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిoదితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి-ఈ రోజు కూడా.. భానుడి భగభగలు