విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ ముడి సరకులను రవాణా చేసే గూడ్స్ రైళ్ల నిర్వహణలో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తోంది. మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఈ డివిజన్ ముడి ఖనిజాలను గమ్య స్ధానాలకు చేర్చడంలో నిర్ధిష్ఠ లక్ష్యాలను చేరుకుంటోంది. అక్టోబరు నెలలో పరిశీలిస్తే 4.65 మిలియన్ టన్నుల లోడ్‌ను హ్యాండిల్ చేసింది. సెప్టెంబరు నెలలో ఇది 4.58 మిలియన్ టన్నులుగా ఉంది. కొవిడ్ సమయంలో ఎక్కడా సర్వీసులకు అంతరాయం లేకుండా చూడడం వల్ల ఏప్రిల్ - అక్టోబరు మాసాల మధ్య డివిజన్ 29.12 మిలియన్ టన్నుల లోడింగ్ చేసింది.
ఈ ఏడాది రైల్వే పలు రాయితీలు ప్రకటించింది. వాటిని వినియోగదారునికి వర్తింపజేస్తూనే.. వ్యాపార అభివృద్ది యూనిట్లను ఏర్పాటు చేసి మరింతగా ఆదాయాన్ని తెచ్చే యత్నంలో వాల్తేర్ డివిజన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు అనుగుణంగా పెంపుదలను వర్తించేట్టుగా చేయడం వల్ల ప్రతి రోజూ సగటున 36.6 ర్యాక్‌లను రవాణా చేస్తోంది. గరిష్ఠంగా ఒక్కో సారి యాభైకి పైగా ర్యాక్‌లను ఒకేరోజు పంపిన సందర్భాలూ ఉంటున్నాయి. ర్యాక్‌ల కొరత లేకుండా, వాటి రవాణాలో ఎక్కడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుకుండా జాగ్రత్త వహిస్తోంది.
ఇదీ చదవండి:
గుంటూరులో కిడ్నాప్ కలకలం... విచారణకు తీసుకెళ్లబోయామన్న పోలీసులు..