ETV Bharat / state

CHIT FUND SCAM: చిట్ ఫండ్ స్కామ్..వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ - చిట్ ఫండ్ స్కామ్ కేసులో మళ్ల విజయప్రసాద్ అరెస్టు వార్తలు

మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మళ్ల విజయప్రసాద్‌ అరెస్ట్ అయ్యారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019 ఒడిశా రాష్రంలో కేసు నమోదైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఐడీ, నేరవిభాగం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విజయప్రసాద్‌ రూ.1200కోట్ల చిట్ ఫండ్ స్కామ్​లో నిందితునిగా ఉన్నారు.

Former MLA arrested by Odisha police in connection with chit fund scam
రూ. 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
author img

By

Published : Sep 7, 2021, 8:38 PM IST

చిట్ ఫండ్ స్కామ్ కేసులో నిన్న విశాఖలో అరెస్ట్​ చేసిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా రాష్ట్రంలోని కటక్​లోని ఓపీఐడి(Odisha Protection of Interests of Depositors) కోర్టులో హాజరుపరిచారు. వెల్ఫేర్ సంస్థ పేరుతో డిపాజిటర్లను 1200 కోట్ల రూపాయల మేర మోసం చేశారనే అభియోగాలపై..సోమవారం విశాఖలో విజయప్రసాద్​ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం కేజీహెచ్​లో వైద్య పరీక్షల అనంతరం.. విశాఖ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్​ రిమాండ్​పై ఒడిశాకు తరలించారు.

అసలేం జరిగింది..

ఒడిశాలోని సంబల్‌పూర్‌లోని ధనుపాలి పోలీస్ స్టేషన్‌లో.. మళ్ల విజయప్రసాద్‌పై కేసు నమోదైంది. వెల్ఫేర్ సంస్థ పేరుతో డిపాజిట్లు సేకరించి.. రూ.1200 కోట్ల కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాలో డిపాజిటర్లకు సక్రమంగా చెల్లింపులు జరపలేదని ఫిర్యాదులు అందాయి. ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, 406,467, 468, 471, 120 (బీ) కింద ఈవోడబ్ల్యూ(EOW) బృందం కేసు నమోదు చేసింది. ఈ కేసుపై సోమవారం విశాఖ వచ్చిన ఒడిశా సీఐడీ పోలీసులు స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మళ్ల విజయప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి:

CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.