ETV Bharat / state

మహిళా రక్షణ కోసం విశాఖలో ఆపరేషన్‌ ‘పహారా’

విశాఖ నగరానికి రాత్రి సమయాల్లో చేరుకునే ప్రయాణికుల రక్షణ కోసం.. ఆపరేషన్‌ ‘పహారా’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాలతో ఈ బృందాలను నియమించారు.

'Operation Pahara'.
ఆపరేషన్‌ ‘పహారా’
author img

By

Published : Aug 30, 2021, 10:28 AM IST

రాత్రి సమయంలో విశాఖ నగరానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతకు నగర పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు.. వారి ఇళ్లకు సురక్షితంగా చేరుకునేలా ప్రణాళిక రచించటంతో పాటు వారికి అండగా నిలుస్తున్నారు. ఆపరేషన్‌ ‘పహారా’ పేరుతో ప్రత్యేక నేర విభాగానికి చెందిన పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

నగర పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకుని, సమీపంలో ఉన్న ప్రధానమైన 16 కూడళ్లలో ప్రతీరోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నేర విభాగానికి చెందిన పోలీసులు పహారా కాస్తున్నారు. కూర్మన్నపాలెం, పాత గాజువాక, ఎన్‌ఏడీ కూడలి, మురళీనగర్‌, గురుద్వారా, మద్దిలపాలెం(ఆర్టీసీ డిపో), రామాటాకీస్‌, ఆర్టీసీ కాంప్లెక్సు, హనుమంతవాక, కార్‌షెడ్‌, ఊశ్వరి కూడలి, తాటిచెట్లపాలెం కూడలి, వేపగుంట, భీమిలి, మారికవలస, వెంకోజీపాలెం.. కూడళ్ల వైపు వచ్చే ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాల రాకపోకలను గమనించటమే కాకుండా నేరస్తుల కదలికలపై దృష్టి సారిస్తున్నారు. ఆయా కూడళ్లలో బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చిన ప్రయాణికులకు ఈ పోలీసు బృందాలు అండగా నిలిచి, వారు ఇళ్లకు చేరుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.

రాత్రి సమయంలో మహిళా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం ఆపరేషన్‌ పహారా పేరిట ప్రత్యేక బృందాలను ప్రధాన కూడళ్లలో నియమించాం. సురక్షితంగా వారి ఇళ్లకు వెళ్లేందుకు కూడళ్లలో అందుబాటులో ఉన్న పోలీసు సేవలను ఉపయోగించుకోవాలి.

- విశాఖ పోలీసు కమిషనర్‌ మనీష్ కుమార్ సిన్హా

ఇదీ చదవండీ.. RAINS : రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా కురిసే అవకాశం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.