కరోనా మనుషులకే కాదు... పశువులకు శాపంగా మారింది. పశువులు ఎంతో ఇష్టంగా తినే ఎండు గడ్డి విశాఖలో దొరకటం లేదు. సాధారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎండు గడ్డి తెచ్చి హనుమంతవాకలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా ఎండు గడ్డి రవాణా తీవ్ర సమస్యగా మారింది. దీనివల్ల విక్రయదారులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట,టెక్కలి తదితర ప్రాంతాల నుంచి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.
విశాఖలో పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించడం, శ్రీకాకుళం జిల్లాలో కరోనా ఉద్ధృతి తక్కువగా ఉండడం వల్ల రెండు జిల్లాల మధ్య రవాణాపై గట్టి నిఘా ఉంది. లారీ ఎండుగడ్డి తరలించడం కష్టమని... ఖర్చులు కూడా రెండింతలు అవుతున్నాయని గడ్డి విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కరోనా లాక్ డౌన్ ప్రారంభంలో రూ.30లు ధర ఉన్న చిన్న గడ్డి మోపు...ప్రస్తుతం రూ. 50లకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: 750 కుటుంబాలకు కూరగాయలు అందించిన వైకాపా నేతలు