ETV Bharat / state

విశాఖలో పూల సోయగాల కనువిందు

author img

By

Published : Jan 24, 2021, 8:10 PM IST

విశాఖ సమీపంలోని ఓ రిసార్ట్‌ సరికొత్త హంగులతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. విశాఖ సమీపంలోని సన్ రే రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పూల సొబగులు సందర్శకులను కట్టి పడేస్తున్నాయి.

విశాఖలో పూల సోయగాల కనువిందు
విశాఖలో పూల సోయగాల కనువిందు

కొవిడ్‌ తర్వాత జనం నెమ్మదిగా బయటకు వస్తున్నారు. విహారయాత్రలకూ వెళ్తున్నారు. వారిని ఆకట్టుకునేలా పర్యాటక ప్రాంతాలు అందంగా ముస్తాబవుతున్నాయి. సందర్శకులకు నచ్చేలా రిసార్టుల నిర్వాహకులు వాటి రూపురేఖలు మార్చుతున్నారు. కనువిందు చేసే పూల సోయగాలతో రిసార్టులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. విశాఖ సమీపంలోని ఓ రిసార్ట్‌ సరికొత్త హంగులతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. విశాఖ సమీపంలోని సన్ రే రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పూల సొబగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నగర వాతావరణానికి భిన్నంగా హాయిగా కుటుంబంతో గడుపుదామని వచ్చే వారికి కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణంలో గడపడం ఎంతో బాగుందంటూ సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో పూల సోయగాల కనువిందు

ఇదీ చదవండి: వాల్మీకుల తిరుమల మహా పాదయాత్ర ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.