డొంకరాయి జలాశయంలో వరదనీరు1036 అడుగుల ప్రమాదస్థాయికి చేరుకుంది. అధికారులు రెండు గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయినా జలాశయం నీటిమట్టం తగ్గకపోవడంతో 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క సిలేరు, జోలపుట్, బలిమెల జలాశయాలకు వరద నీరు పోటెత్తింది.
అధికారులు జలాశయాల వద్ద మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డొంకరాయి నుంచి 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో తూర్పుగోదావరి జిల్లా ముంపు మండలాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఇదీ చదవండి: