ETV Bharat / state

Visakha Boy Suspicious Death Case: విశాఖ బాలుడి అనుమానాస్పద మృతి కేసులో.. మరో మలుపు

author img

By

Published : Jun 13, 2023, 2:01 PM IST

Visakha Boy Suspicious Death Case: విశాఖలో ఐదురోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన తేజ అనే బాలుడి కేసు వివిధ మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

Visakha Boy Suspicious Death Case: విశాఖ పెందుర్తి ఎస్ఆర్​పురం కాలనీలో ఐదు రోజుల క్రితం మృతి చెందిన తేజ అనే బాలుడి(5) కేసు వివిధ మలుపులు తిరుగుతోంది. ఆ బాలుడి చేతికి రెండు ఘాట్లు ఉండటంతో.. పాము కాటుకు గురై మరణించినట్లు పోలీసులు, గ్రామస్థులు మొదట భావించారు. అయితే తాజాగా ఈ ఘటనలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

బాలుడి మృతదేహం లభ్యమైన ప్రాంతానికి కొంత దూరంలో 'లెండి వనం' రిసార్ట్ ఉంది. అయితే తేజ ఆ రిసార్ట్​లోని స్విమ్మింగ్ ఫూల్​లో పడి మరణించినట్లు బాలుడి తల్లిదండ్రులకు సోమవారం సమాచారం అందింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపి.. తమ కుమారుడిని ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనలు చేపట్టారు. దీంతో గంట పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కాగా ఈ ఘటనలో వెలుగులోకి వచ్చిన అంశం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

"బాలుడి మృతిపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో సమీపంలోని 'లెండి వనం' రిసార్ట్​లో పనిచేసే వాచ్​మెన్​ తాడి నారాయణ.. బాలుడు స్విమ్మింగ్ ఫూల్​లో పడి మరణించినట్లు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో చెప్పాడు. తాను లేని సమయంలో వచ్చిన ఆ బాలుడు అక్కడ మరణించగా.. భయపడి బాలుడి మృతదేహాన్ని ఎవరూ లేని సమయంలో సమీపంలో పడేసినట్లు వాచ్​మెన్​ సమాచారం అందినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో రిసార్ట్​లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాము. ముందుగా పోస్ట్​మార్టం రిపోర్ట్ వస్తే అన్నీ పరిశీలించి ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటాము." - పెందుర్తి సీఐ అప్పారావు

ఇదీ జరిగింది..
పెందుర్తి మండలం ఎస్ఆర్ పురంలో తేజ అనే ఐదేళ్ల బాలుడు కనిపించటం లేదని తల్లిదండ్రులు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే లారీ యార్డ్​లో బాలుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆడుకుంటానని బయటకు వెళ్లిన బాలుడు.. విగత జీవిగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.

కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్​కు తరలించారు. కాగా బాలుడి నోట్లో నుంచి నురగలు రావటం, చేతులకు ఘాట్లు ఉండటంతో.. పాముకాటుతోనే తేజ మృతిచెంది ఉంటాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పోస్ట్​మార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు తెలిసిన అనంతరం.. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. ఆడుతూ పాడుతూ ఉండే బాలుడు చిరు ప్రాయంలో మృతిచెందటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.