ETV Bharat / state

పుష్కరిణిలో చేపలను చంపేశారు - fish were killed in the pond

విశాఖ జిల్లా చోడవరంలో స్వయంభూ గౌరీశ్వర ఆలయం పుష్కరిణిలో చేపలు చనిపోయి నీటిపై తేలాయి. ఆదాయం వచ్చే చేపల కోసం నాసిరకం చేపలను మత్స్యకారులే మందు జల్లి చంపేసినట్లు చెబుతున్నారు.

fish were killed in the pond
చెరువులో చేపలను చంపేశారు
author img

By

Published : Oct 8, 2020, 12:35 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో ప్రసిద్ధి చెందిన స్వయంభూ గౌరీశ్వరుని సన్నిధిలోని పుష్కరిణిలో చనిపోయిన చేపల కంపుతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవదాయ శాఖ చర్యలపై విరచుకుపడుతున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఇటీవల పుష్కరిణీలో చేపలకుగాను వేలం పాట నిర్వహించారు. ఈ పాట ద్వారా రూ.93 వేల మేర ఆదాయం వచ్చింది. పాట పాడుకున్న మత్స్య కారుడు చేపల పెంపకానికి గాను వేసే ఆహారపదార్థాలు, మందులు వల్ల పుష్కరిణి బాగా కలుషితమైపోయింది. గొర్రలు రకానికి చెందిన చేపలకు మార్కెట్​లో ధర తక్కువ... ఇవి మిగిలిన చేపలను తినేస్తాయని తెలియడంతో ఆదాయం ఎక్కువగా వచ్చే చేపలను రక్షించుకునేందుకు మందులు వేసి చంపేస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు.
పవిత్రమైన పుష్కరిణిని ఇలా అవిపత్రం చేసే చర్యలపై దేవదాయ శాఖ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ఇవీ చదవండి: మాకవరపాలెంలో మాయాజాలం... క్వారీ లేకుండానే రూ. కోట్ల ఆర్జన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.