విశాఖ వన్ టౌన్ పరిధిలోని విక్టోరియా ప్రభుత్వ ఆస్పత్రి ఎస్ఎన్సీ బ్లాక్లో తెల్లవారు జామున విద్యుదాఘాతం సంభవించింది. చిన్నపిల్లలకు చికిత్స అందించే వార్డులో ఈ ప్రమాదం జరిగింది. స్టెబిలైజర్ ఇన్సైడ్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే గుర్తించారు.
తప్పిన పెను ప్రమాదం..
అనంతరం విద్యుత్ సరఫరా నిలుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సకాలంలో సిబ్బంది స్పందించారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, పిల్లలకు ఎలాంటి ప్రాణా పాయం జరగలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై అనుమానాలు: తెలుగు యువత