విశాఖ జిల్లా సింహాచలం తొలిపంచ వద్ద ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. తొలిపంచ వద్ద ఉన్న దేవస్థానం రేకుల షాపు వద్ద గత కొద్ది రోజులుగా పచ్చి కొబ్బరి ముక్కలు అగ్నితో కాక పెడుతూ నూనె తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సమీప దుకాణదారులు మంటలు అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి..