తూర్పు గోదావరి జిల్లా ఏలేరు కాలువను విశాఖ జిల్లా తాండవ జలాశయానికి అనుసంధానం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి తెలిపారు. నర్సీపట్నంలో స్థానిక శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏలేరు కాలువ నీరు.. తూర్పు, విశాఖ జిల్లాల మీదుగా స్టీల్ ప్లాంట్ కు తరలుతున్నప్పటికీ ఆయా జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందజేత ఆశాజనకంగా లేదన్నారు. ఈ విషయాలను అధ్యయనం చేసిన విశాఖ జిల్లా పాయకరావుపేట, నర్సీపట్నం ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ఉమాశంకర్ గణేష్లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని మరికొంతమంది శాసనసభ్యులు ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఈ రెండు జలాశయాల అనుసంధానానికి హామీ ఇచ్చారని నారాయణమూర్తి వివరించారు.
ఇవీ చూడండి..