ETV Bharat / state

'కుమార్తె మాట వినలేదని... గొంతు కోసుకున్న తండ్రి' - children love marriage

ఓ తండ్రి ఎన్నో ఆశలతో పెంచాడు కుమార్తెను. ఆమె భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి... ఓ పూట తిని... మరో పూట పస్తులుండి కష్టపడ్డాడు. కానీ... తన కలలు కల్లలు చేసిందని... మాట వినకుండా... ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుందని మనస్తాపానికి గురైన ఆ తండ్రి... గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

కూతురు మాటవినలేదని... తండ్రి గొంతు కోసుకున్నాడు
author img

By

Published : Oct 19, 2019, 4:50 PM IST

Updated : Oct 19, 2019, 11:35 PM IST

విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం సమీపంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన పిరిపిల్లి కొర్లయ్య కుమార్తె ఇటీవలే మేజర్​ అయింది. ఆమెకు కప్పరాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయమేర్పిడింది. వారిద్దరూ ప్రేమించుకొని, వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబీకులు ఒప్పుకోలేదు. వారిని ఎదిరించి ఎవరికీ తెలియకుండా గురువారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

శుక్రవారం నూతన దంపతులిద్దరూ కంచరపాలెం ఠాణాకు వచ్చి... కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వయసు, వివాహ ధ్రువపత్రాలతో సాయంత్రం స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించారు. కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ఇరువురి కుటుంబ సభ్యులకూ సమాచారం ఇచ్చారు. యువకుడి కుటుంబీకులు స్పందించలేదు. యువతి తరఫునవారు పోలీస్​స్టేషన్​కు వచ్చారు.

పోలీస్​స్టేషన్​లో కన్నకుమార్తెను చూసిన వెంటనే... తన మాట వినలేదని మనస్తాపానికి గురైన కొర్లయ్య... ఠాణా ఆవరణలోనే కత్తితో గొంతు కోసుకున్నాడు. స్పందించిన పోలీసులు వెంటనే అతడిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

కూతురు మాటవినలేదని... తండ్రి గొంతు కోసుకున్నాడు

ఇదీ చదవండీ... గ్యాస్​ సిలిండర్​ పేలి.. సజీవ దహనమైన కుటుంబం

Intro:Ap_Vsp_91_19_Father_Sucide_At_Policestation_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) కుమార్తె తన మాట వినకుండా... ప్రేమించిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపానికి గురైన తండ్రి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. Body:తాటిచెట్లపాలెం సమీపంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన పిరిపిల్లి కొర్లయ్య కుమార్తె(18)కు ఇటీవలే మైనార్టీ తీరింది. ఆమెకు కప్పరాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ప్రేమించుకుని, వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఇరు కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో గురువారం వారిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.

Conclusion:శుక్రవారం నూతన దంపతులిద్దరూ కంచరపాలెం పోలీసుస్టేషన్‌కు వచ్చి తమ తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. స్పందించిన పోలీసులు సంబంధించిన వయసు, వివాహ ధ్రువపత్రాలతో సాయంత్రం స్టేషన్‌కు రావాలని సూచించారు. కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు వారి వారి కుంటుబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. యువకుడి కుటుంబీకులు స్పందించకపోగా, యువతి కుటుంబీకులు స్టేషన్‌కు వచ్చారు. కన్నకుతూర్ని చూసిన వెంటనే... తన మాట వినలేదని మనస్తాపానికి గురైన కొర్లయ్య స్టేషన్‌ ఆవరణలోనే చాకుతో గొంతు కోసుకున్నాడు. స్పందించిన పోలీసులు వెంటనే అతడిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
Last Updated : Oct 19, 2019, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.