విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం ఏనుగు రాయిలో.. దారుణం జరిగింది. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రి సూరిబాబుతో కుమారుడు ప్రసాద్ వాగ్వాదానికి దిగాడు. ఆ మత్తులో కర్ర తీసుకొని.. తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఒక్కసారిగా సూరిబాబు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సంఘటన జరిగిన ప్రాంతంలోనే సూరిబాబు ప్రాణాలు విడిచాడు. కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి... : ఇద్దరు మహిళలు అదృశ్యం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు