విశాఖపట్నంలోని మన్యం ప్రాంతం, కొండవాలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడ ఎక్కువగా పండే వరి.. ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న తరుణంలో.. వర్షాలు భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. గడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తూ.. పొలాలను నీట ముంచేస్తున్నాయి. వరదల కారణంగా.. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు ఘాట్రోడ్లో కొండచరియలు విరిగి రోడ్లపై పడుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అత్యధిక వర్షపాతం ముంచింగిపుట్టులో నమోదయ్యింది. ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి పారుదల శాఖ వైఫల్యం వల్లే పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది చూడండి: పసివాడని చూడకుండా.. పొట్టనబెట్టుకున్నాడు!