ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటం విశాఖ జిల్లా వ్యవసాయ రైతులకు సంతోషాన్నిచ్చింది. రైవాడ, తాండవ, సీలేరు, జలాశయలు నిండా నీళ్లు ఉండటం రైతులకు మరింత మేలు చేస్తోంది. ఇప్పటికే రైతుభరోసా పథకంతో.. రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగుమందులు ఇతర వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను ప్రభుత్వం అందిస్తోంది. వీటికోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా.. జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. జిల్లా వ్యవసాయ శాఖ.. నగదు రహిత లావాదేవీలు జరిగేలా చేస్తూ.. రైతులకు మేలు చేస్తోంది. ఈ విధానాన్ని అందరూ రైతులు అలవాటు చేసుకోవాలని.. అవగాహన కోసం సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను సందర్శించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రాజధానిపై కౌంటర్ దాఖలుకు జనసేన నిర్ణయం