ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: పడిపోయిన వంగ ధరలు..రోడ్డుపై పారబోసిన రైతులు

లాక్​డౌన్ నిబంధన రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్​కు తీసుకొచ్చిన వంకాయలకు ధర లేక పారబోసిన సంఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో జరిగింది.

Farmers are throwing brinjal in Devarapalli
దేవరాపల్లిలో వంకాయలను పారబోస్తున్న రైతులు
author img

By

Published : Apr 16, 2020, 3:47 PM IST

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మార్కెట్​కు పరిసర ప్రాంతాల నుంచి రైతులు వంకాయలు తీసుకొచ్చారు. సరకు ఒక్కసారిగా రావడంతో ధరలు పతనమయ్యాయి. కనీసం కోత డబ్బులూ రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 కేజీల ట్రేను రూ.50కు అడుగుతున్నారని వాపోయారు. ఆందోళనకు గురైన అన్నదాతలు వంకాయలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీచదవండి.

'ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.