విశాఖ జిల్లా కశింకోట మండలం గోకివానిపాలెంలోని మామిడితోటలో మిడతలతో రైతులను ఆందోళన చెందారు. ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి వచ్చి మిడతలకు ఫొటోలు తీసి రాజస్థాన్లోని జోధ్పూర్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలకు పంపారు. పరిశీలన చేసి ఇవి గడ్డి మిడతలుగా గుర్తించారు. రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని... వీటిని నిర్మూలించేందుకు కావలసిన మందులను శాస్త్రవేత్తలు సూచించారు. గడ్డి మిడతలు పంటను పెద్దగా నాశనము చేయవని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జీడి మామిడితోటలోకి వచ్చి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రభుత్వ పరంగా సహకారాన్ని రైతులకు అందిస్తామని వివరించారు.
ఇదీ చూడండి