విశాఖ జిల్లా చీడికాడ మండలం చెట్టుపల్లి వద్ద అద్దిపల్లి కాశీ(44) అనే రైతు తాటిచెట్టు కొమ్మలను నరకుతుండగా ఒక్కసారిగా తాటిచెట్టు వేళ్లతో సహా కూలిపోయింది. చెట్టుతో సహ కాశీ కిందపడిపోయాడు. కాశీకి బలమైన గాయాలుకాగా... కుటుంబసభ్యులు చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాశీ మృతి చెందాడు. మృతుని తమ్ముడు రాము ఫిర్యాదు మేరకు చీడికాడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సురేశ్ కుమార్ తెలిపారు.
తాటిచెట్టు విరిగిపడి రైతు మృతి - crime news chidikada mandal
తాటి ఆకులను నరుకుతుండగా చెట్టు విరిగిపడి ఓ రైతు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా చీడికాడ మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
![తాటిచెట్టు విరిగిపడి రైతు మృతి Farmer killed falling from palm tree at vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7355171-101-7355171-1590495758129.jpg?imwidth=3840)
మృతి చెందిన రైతు కాశీ
విశాఖ జిల్లా చీడికాడ మండలం చెట్టుపల్లి వద్ద అద్దిపల్లి కాశీ(44) అనే రైతు తాటిచెట్టు కొమ్మలను నరకుతుండగా ఒక్కసారిగా తాటిచెట్టు వేళ్లతో సహా కూలిపోయింది. చెట్టుతో సహ కాశీ కిందపడిపోయాడు. కాశీకి బలమైన గాయాలుకాగా... కుటుంబసభ్యులు చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాశీ మృతి చెందాడు. మృతుని తమ్ముడు రాము ఫిర్యాదు మేరకు చీడికాడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సురేశ్ కుమార్ తెలిపారు.
ఇదీచదవండి:విశాఖలో విమాన సర్వీసులు ప్రారంభం