'భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు' - land poolling problems
విశాఖ జిల్లా పద్మనాభం మండలం నరసాపురంలో భూసమీకరణ సభ రసాభాసగా మారింది. ఏళ్ల తరబడి తక్కువ విస్తీర్ణంలో భూమిని చదును చేసి సాగు చేస్తున్నామని ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. ఈ భూములు లేకపోతే తమకు బతుకే లేదని వాపోయారు. సాధ్యమైతే తమకు ఇళ్ల పట్టాలిప్పించాలని కోరారు. అంతేకాని భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఏళ్లుగా భూ తల్లినే నమ్ముకున్నాం.. మా పొట్ట కొట్టొద్దు..!