ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దామ్రా ఓడరేవు సమీపంలో యస్ తుపాను తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దామ్రా-చాంద్‌బలి మధ్య ఇది భూమిని తాకుతుందని.. భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన 'యస్'తో చాందబలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
రాష్ట్రంలో పొడి వాతావరణం..
యస్ తుపాను కారణంగా రాష్ట్రంలో గురువారం నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. బుధవారం వర్షాలు పడే సూచనల్లేవని.. పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని స్పష్టం చేసింది.
అంచనాలకు తగ్గట్లుగానే..
శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే 'యస్' తుపాను క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. ఫలితంగా ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు "ఎరుపు రంగు హెచ్చరిక' జారీ అయింది. 185 కి.మీ వేగంతో గాలులు ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, ఆ రాష్ట్రంలోని బాలాసోర్‌కి 250 కి. మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
మధ్యాహ్నం తీరం దాటనుంది..
యస్ తుపాను దామ్రా పోర్టుకు ఉత్తర దిక్కులో, బాలాసోర్‌కు దక్షిణంగా ఉన్న ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం తీరం దాటుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ సమయంలో గంటకు 185 కి.మీ వరకు వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గాలుల అల్లకల్లోలం..
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాం కోట్నం, కృష్ణ పట్నం ఓడరేవులో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో గాలుల ఉద్ధృతి కొనసాగుతుంది. బుధవారం ఉదయం ఉడా తుపాను ప్రభావం ఉంటుంది.
అసాధారణ రీతిలో..
ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలో అలాగే మద్య బంగాళాఖా తంలో సముద్రం అసాధారణ రీతిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలపై తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చ రిస్తున్నారు. ఝార్ఖండ్, బిహార్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు 2 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు బంగాల్ వాసులు..
ముందు జాగ్రత్త చర్యగా పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతాల నుంచి లక్షల మందిని, ఒడిశా నుంచి లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో బెంగాల్లో 74 వేల మంది బలగాలను, రెండు లక్షల మంది పోలీసులు/ పౌర సేవ కుల్ని రంగంలో దించారు. రాత్రంతా సచివాలయంలోనే ఉంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితిని సమీక్షించారు.
ఒడిశాలోని ఆ 4 జిల్లాలకు పెనుముప్పు..
బెంగాల్‌కు 17 కాలమ్ సైనిక బలగాలను పంపినట్లు సైనిక ప్రతినిధి ఒకరు దిల్లీలో వెల్లడించారు. తుపానుతో ఒడిశాలోని నాలుగు జిల్లాలకు పెనుముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర ప్రత్యేక పునరావాస కమిషనర్ పి.కె.నా పేర్కొన్నారు. తుపాను తీరం దాటేటప్పుడు భారీ నష్టం వాటిల్లుతుందనే అంచనాలతో ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని వివరించారు. ఒడిశాలోని 30 జిల్లాల్లో సుమారు 50 మి.మీ చొప్పున వర్ష పాతం నమోదైంది.
ఝార్ఖండ్ హిస్టరీలో తొలిసారి..
ఝార్ఖండ్ చరిత్రలో ఇలాంటి తుపానును చూడటం ఇదే తొలిసారని.. ఎదుర్కునేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ నీరజ్ సిన్హా స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : అతి తీవ్ర తుపానుగా 'యాస్'