విశాఖ తూర్పు నౌకాదళాన్ని సందర్శించిన మాజీ అడ్మిరల్ - ex navy admiral prakash visits vizag navy coastal area
మాజీ నౌకాదళ అధిపతి అడ్మిరల్ ప్రకాష్ రెండు రోజులు విశాఖలో పర్యటించారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్ధావరంలో నౌకాదళ అధికారులను, సీనియర్ సిబ్బందిని ఉద్దేశించి నాయకత్వ లక్షణాలపై ప్రసంగించారు. నౌకాదళంలోని వివివధ యూనిట్లకు చెందిన అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ ఏకే జైన్ మాజీ నౌకాదళ అధిపతి ప్రకాష్‌ను సత్కరించారు.