అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ, కేఎల్బీ పట్నం, కేజే పురంలో ఆయన పర్యటించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40వేల వరకు నష్టం వాటిల్లిందన్నారు.
ఇవీ చదవండి..