విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి భాజపా నాయకులపై విమర్శలు గుప్పించారు. నిన్నటి వెబినార్లో ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన విషయాన్ని గంటా ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు విషయంలో తమ ప్రభుత్వ నిర్ణయం మారదనే సంకేతాలను మోదీ ఇచ్చారన్నారు.
ప్రజలను మోసగించడం ఆపండి...
ప్రధాని స్పష్టంగా చెబుతున్నప్పటికీ రాష్ట్రంలోని భాజపా నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని.. ఇప్పుడు ఈ విషయంపై ఏం చెప్తారంటూ గంటా వారిని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను భాజపా నాయకులు మభ్యపెడుతున్నారన్న ఆయన.. పదవుల కోసం కాకుండా ప్రాంతం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వెంటనే కార్యచరణ ప్రకటించి ఏకతాటిపై నడిచి విశాఖ ఉక్కును కాపాడుకుందామని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: