ఎన్నికలను నిర్వహించడంలో విశాఖ జిల్లా కలెక్టర్ వైఫల్యం చెందారని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఎన్నికల కౌటింగ్ సక్రమంగా నిర్వహిస్తారన్న నమ్మకం తమకు లేదన్నారు. సీనియర్ కేంద్ర అధికారులను ప్రత్యేక అబ్జర్వర్లుగా నియమించి వాళ్లకు కౌటింగ్ బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల కమిషన్ను కోరామని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా కలెక్టర్ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పనిచేయని ఈవీఎంలను మార్చకుండా ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి