ETV Bharat / state

"ఐ లవ్‌ యూ డార్లింగ్‌.. నీ ఫొటో పంపు".. వైరల్​ అవుతున్న మాజీ మంత్రి అవంతి ఫోన్​ సంభాషణలు - latest news in ap

EX MINISTER AVANTHI AUDIO VIRAL :' లవ్‌ యూ బంగారం.. నీతో మాట్లాడి ఎన్నాళ్లైందో.. ముందు నీ ఫొటో పంపు.. నాలుగో తేదీనా దిల్లీలో కలుద్దామా' అంటూ యువతిని ఫోన్‌లో ప్రాధేయపడుతున్న ఆడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యామాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ స్వరం మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుదేనంటూ.. తీవ్ర దుమారం రేగింది.

EX MINISTER AVANTHI AUDIO VIRAL
EX MINISTER AVANTHI AUDIO VIRAL
author img

By

Published : Nov 14, 2022, 12:22 PM IST

వైరల్​ అవుతున్న మాజీ మంత్రి అవంతి ఫోన్​ సంభాషణలు

EX MINISTER AVANTHI AUDIO VIRAL : ‘లవ్‌ యూ బంగారం.. ఐ లవ్‌ యూ డార్లింగ్‌.... నీతో మాట్లాడి ఎన్నాళ్లైందో.. ముందు నీ ఫొటో పంపు.. నాలుగో తేదీన దిల్లీలో కలుద్దామా’ అంటూ ఓ మహిళతో ఓ వ్యక్తి జరిపిన సంభాషణలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఆ స్వరం మాజీ మంత్రి, వైకాపా విశాఖ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాసరావుదేనంటూ కొన్ని ఛానళ్లు ఆయన ఫొటోతో సహా కథనాలు ప్రసారం చేయడంతో ఇది కలకలం రేగింది. ఫోన్లో మాట్లాడిన మహిళ.. తాను హైదరాబాద్‌లోని ‘ప్రియాంక రెసిడెన్సీ’లోకే ఇల్లు మారుతున్నానని చెప్పగా.. తన కుమార్తె చాలా షార్ప్‌ అని, పసిగట్టేస్తుందని... అక్కడికి ఎందుకని’ ఇవతలి వ్యక్తి ప్రశ్నించారు.

గతంలో అవంతి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన విశాఖ నగరానికి చెందిన ఓ వివాహితతో ప్రేమపూర్వక సంభాషణలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. తన గొంతును అనుకరించి ఫేక్‌ సంభాషణలు రికార్డు చేశారని ఆయన సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తును అధికారులు ఇంకా పూర్తి చేయనే లేదు. వాస్తవాలు ఏమిటన్నవి బయటపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన స్వరంతో పోలిన మరో ‘వాయిస్‌ క్లిప్పింగ్‌’ వెలుగు చూడటం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయగా.. మళ్లీ సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.

సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించా: 'నా కీర్తి ప్రతిష్ఠలను, రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా నా స్వరాన్ని పోలిన సంభాషణలు విడుదల చేశారు. నేను గత 15 రోజులుగా అయ్యప్పస్వామి మాలలో ఉన్నా. పది రోజుల కిందటే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లో ఈనెల 11న ఫిర్యాదు చేయించా. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు' అని అవంతి శ్రీనివాసరావు తెలిపారు.

న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తాం: ' మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేస్తాం. ఈ సంభాషణలు వేల మందికి చేరాయి. మొట్టమొదట ఎవరు దీనిని సామాజిక మాధ్యమాల్లోకి విడుదల చేశారన్నది తెలుసుకోవడానికి సమయం పడుతుంది' అని సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్​ సీఐ భవానీ ప్రసాద్​ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.