విశాఖ జిల్లా ఎలమంచిలిలో నిర్వహించిన తెదేపా విస్తృత స్థాయి సమావేశానికి మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలంతా పార్టీ వెన్నంటే ఉన్నారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో పేదల రేషన్ కార్డులను సీఎం జగన్ రద్దు చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లు కట్టుకోవడానికి సెంటు స్థలం ఇస్తే దేనికి సరిపోతుందని ప్రశ్నించారు.
తెదేపా నేతలపై కేసులు పెట్టి కక్ష సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి.. సీఎం సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లాలని.. కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకులు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందన్నారు.
ఇదీ చదవండి: