ETV Bharat / state

దాతృత్వం చాటుకుంటున్న దాతలు - tdp news

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న వేళ.. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సైతం తోడ్పాటును అందిస్తున్నారు.

esssential need distribution to the poor
దాతృత్వం చాటుకుంటున్న దాతలు
author img

By

Published : May 26, 2020, 10:50 AM IST

లాక్ డౌన్ సమయంలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వారి సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ ఇబ్బంది పడుతున్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు.

విశాఖ జిల్లాలో...

కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అనకాపల్లి మండలం కోడూరు, కొండు పాలెం, పాపయ్యపాలెం, పాపయ్య సంతపాలెం, చేనుల అగ్రహారంలో పేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అందజేశారు. ముస్లింలకు రంజాన్ తోఫా అందించారు. పట్టణంలోని 81 వ వార్డులో 80 మంది వార్డు వాలంటీర్లకు నిత్యవసర సరుకులు అందజేశారు.

గుంటూరు జిల్లాలో...

తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం వేయులూరిపాడులో 400 పేదల కుటుంబాలకు తెదేపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. పార్టీ నేతలు కొత్తపల్లి కోటీస్వరరావు, తలతోటి సురేంద్ర యనమల ప్రకాష్, పచాల రాజు, కటికల రాము, బంధనడం సతీష్ వడ్లమూడి పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.