ETV Bharat / state

గణాంకాలు సమగ్రంగా ఉంటే వైరస్‌ గమనాన్ని అంచనా వేయొచ్చు - కరోనా వ్యాప్తిపై ఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ జావేద్​తో ముఖాముఖి

దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనానికి మరింత పకడ్బందీ వ్యూహం అవసరమని మెడికల్ ఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ జావేద్ అభిప్రాయపడ్డారు. వైరల్, బ్యాక్టీరియా వ్యాధులపై దేశవిదేశాల్లో అధ్యయనం చేసిన ఆయన, కోవిడ్ వైరస్ గమనం ఇంకా పూర్తిగా బయటపడలేదని చెప్పారు. వీటికి సంబంధించిన గణాంకాలను దాపరికం లేకుండా నమోదుచేయాలని, అప్పుడే నియంత్రణ వ్యూహాలకు ఉపకరిస్తాయంటున్న డాక్టర్‌ జావేద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

entomologist jawed face to face interview about corona panadamic
గణాంకాలు సమగ్రంగా ఉంటే వైరస్‌ గమనాన్ని అంచనా వేయోచ్చన్న ఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ జావేద్
author img

By

Published : Jul 23, 2020, 12:49 PM IST

గణాంకాలు సమగ్రంగా ఉంటే వైరస్‌ గమనాన్ని అంచనా వేయోచ్చన్న ఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ జావేద్

దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనానికి మరింత పకడ్బందీ వ్యూహం అవసరమని... మెడికల్ ఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ జావేద్ ఈటీవీ భారత్​ నిర్వహించిన ముఖాముఖిలో తెలిపారు.

ప్రశ్న: కరోనా వైరస్ ఇప్పుడు నడుస్తున్న దశ ఎంతవరకు ఉండవచ్చు ?

జవాబు: కెనడాలోని వెస్ట్రనైల్ వైరస్ గురించి నేను ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఐదేళ్లు కలిసి పని చేశా. ఇది బాగా వైరస్ కొత్త వైరస్....డెంగీ, కరోనా, జైది వైరస్ అన్నీ అక్కచెల్లెళ్ల మాదిరి గా ఉంటాయి. డెంగీ పైన నేను 17 ఏళ్లు పనిచేసి ఒక అధ్యయనాలను సమర్పించాను.వైరస్ పెరుగుదల ఒక పర్వతం ఎత్తు కు చేరినట్టుగా ఉంటుంది. అక్కడి నుంచి పతాక స్థాయికి చేరుకొని క్రమంగా తగ్గుతుంది. ఇది సాధారణం గా వైరస్ గమనం. ఇందులో మూడు దశలు ఉంటాయి. క్లైంబింగ్ ద మౌంటెన్, స్టేయింగ్ ఆన్ ది ప్లాటో, కమింగ్ డౌన్ ది మౌంటెన్ అంటారు. ఇప్పుడు కరోనా కి న్యూయార్కు ఒక చక్కని ఉదాహరణ.

న్యూయార్క్ రాష్ట్రంలో ఒకప్పుడు పతాక స్థాయిలో ఉన్న కరుణ కేసులు వ్యాప్తి ఇప్పుడు ఒకటికి చేరింది. ఇన్ఫెక్షన్ రేటు ఒకటికి తగ్గింది .ఆ తర్వాత అది సున్నకు చేరుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ప్రజలకు పూర్తి అవగాహనతో, వ్యాప్తి నిరోధక చర్యలు పాటించడం ముఖ్యం. ఇందులో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఫ్లోరిడా డెంగీపై నేను చేసిన పరిశోధనలో కొన్ని విషయాలు కూడా ఇదే అంశాల్ని చెబుతాయి. పతాకస్థాయిలో చేరుకొని రానున్న కొద్ది సంవత్సరాలు అది కనిపించని అవకాశం కూడా ఉంది. దీన్ని రెస్టింగ్ పిరియడ్ అంటారు మళ్లీ అది విజృంభించే అవకాశం కూడా ఉంటుంది. డెంగీ ఫీవర్ పై పదిహేడేళ్ల డేటా ఇదే అంశాలను స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ అంతమై పోయే అవకాశం కూడా ఉంది.

ప్రశ్న: కరోనా మరో రెండేళ్ల పాటు పతాక స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు కదా..

జవాబు: ఇది కొత్త వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో అన్న అంశంపై స్థిరంగా చెప్పలేము. ఊహాగానాలు తో దీన్ని మనం సిద్ధాంతీ కరించలేము. ఇప్పటికే తగ్గిన దేశాల డేటాను, వారి అనుభవాలు పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ వ్యాప్తి అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చేస్తుంది. ప్రజల జీవనోపాధిని పురోగతిని పూర్తిస్థాయిలో ప్రభావం చూపిస్తుంది.

ప్రశ్న: వైరస్ నియంత్రించడంలో ఎవరి పాత్ర ఎంత ఉంటుందని అంచనా?

జవాబు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేస్తున్నారు. కరోనా హాట్ స్పాట్​లలో ఈ అధ్యయన పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీరలాజికల్ ఎపిడిమాలజి అధ్యయనం చేస్తున్నారు. దీనికి యాంటీ బాడీస్ టెస్ట్ చేస్తున్నారు. సామూహికంగా ఒక కాలనీలో వైరస్ వ్యాప్తి.... అక్కడ నివసించే ప్రతి ఒక్కరికి లో వైరస్ వచ్చిందా, ఉండి వెళ్లిపోయిందా అన్ని అంశాలు నమోదవుతాయి.

ఈ డేటా వైరస్ నియంత్రణలో వ్యూహాలను అమలుచేసుకోవడానికి శాస్త్రీయమైన ఆధారం లభిస్తుంది. కేరళలో నెలన్నర క్రితం ఈ రకమైన అధ్యాయనం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ వైరస్ నియంత్రణ కోసం తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం వారి రక్షణ కోసం కాదు ఎదుటి వారి రక్షణ కోసం. మీరు ఆరోగ్యవంతులైనా, వైరస్ సోకిన వారైనా మాస్కులు ధరించడం వల్ల మీకు ఉపయోగం కంటే ఎదుటివారికి పూర్తిగా రక్షణ లభిస్తుంది. ఎదుటివారిని చంపే హక్కు నీకు లేదు కాబట్టి మాస్క్ ధరించి తీరాలి. నాకేమీ కాదు అన్న ధోరణి విడిచిపెట్టాలి. రెండోది భౌతిక దూరం పాటించడం మద్యం దుకాణాల వద్ద ఇవి ఎక్కడా కానరావడం లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత ఇందులో ఉంది.

ప్రశ్న: కరోనా మహమ్మారి ఏ దశలో ఉంది. ఇది మామూలు స్థాయికి రావడానికి ఎప్పటికీ అవకాశం ఉంది?

జవాబు: ఎపిడిమియోలజీలో లోకల్ బ్రేక్ ఔట్​తోనే ఆరంభమవుతుంది. వూహన్ సిటీలో బ్రేకౌట్ అయ్యింది. అక్కడి నుంచి వ్యాప్తి చెందింది. ఒక్కసారికే ఇది ఏపిడమిక్ గా మారింది. తరువాత ఇది ఎండమిక్ అవుతుంది. అంటే ఒక ప్రాంతానికి పరిమితం అయితే దాన్ని ఎండమిక్ అంటాం. ఉదాహరణకు పాడేరులో మలేరియా డేటా తీసుకుందాం... వంద మందికి పరీక్షిస్తే 30 మందికి ఈ వ్యాధి ఉంటుంది. దీన్ని ఎండమిక్ అంటాం. పాండమిక్ అంటే అందరికీ సంక్రమించేది అని. మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేది అని. ఇక్కడ ఒక మినహాయింపు ఉండొచ్చు. ఒక దీవిలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆ దీవికి వ్యాపించకుండా ఉండే అవకాశం ఉంది.

ప్రశ్న: హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి ఇది ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది ?

జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న. ఒక సమూహంలో పూర్తిస్థాయిలో రోగనిరోధకశక్తి రావడం. దీన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఒక సూచిక ద్వారా మనకి తెలుస్తుంది. ఒక ప్రాంతంలో వ్యక్తులందరూ యాంటీ బాడీ టెస్ట్ చేసినప్పుడు వారికి రోగ నిరోధక శక్తి వచ్చిందా వైరస్ సోకిన లేదా అన్నది కూడా మనకి తెలుస్తుంది. ఇది భవిష్యత్తులో వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. 70 శాతం మంది ప్రజలకు ఇమ్మ్యూనిటి వస్తే దాన్ని మనం గుర్తించొచ్చు. ఒక ప్రదేశంలో ఒక కాలనీలో ఈ రకమైన డేటా తీసుకోవడం వల్ల మనం దాన్ని నిర్ధారించవచ్చు.

ప్రశ్న: ముంబై ధారవి మురికి వాడలో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఒక దశలో పతాకస్థాయిలో కేసులు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అక్కడ నిలిచిపోవడం తగ్గడం జరుగుతున్నాయి దీనిని మనం హర్డ్ ఇమ్యూనిటీ గా భావించవచ్చా?

జవాబు: పరీక్షలకు సంబంధించిన పూర్తి డేటా ఉంటే దాన్ని విశ్లేషిస్తూనే మనం చెప్పగలము. గాలి కబుర్లు వల్ల ఇది సాధ్యం కాదు. ఆర్.టి.పి.సిఆర్.పరీక్షల వల్ల వ్యాధి నిర్ధరణ , వైద్యులు చికిత్స అందించడానికి ఉపకరిస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ గుర్తించాలంటే ఎపిడిమియోలజీ సర్వే పూర్తిగా ఒక ప్రాంతంలో చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న: కరోనా వ్యాప్తి పతాక స్థాయికి చేరుకుంటోంది... భారతదేశంలో వాతావరణ పరిస్థితులు వ్యాప్తి చేయడానికి ఎంత వరకు అవకాశం ఇస్తున్నాయి?

జవాబు: ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. న్యూయార్క్​ని తీసుకుంటే ఒకేసారి పతాక స్థాయికి వెళ్లి ఆ పరిస్థితిలోనే చాలా రోజులు కొనసాగింది. ఒకేసారి కింద పడింది. దీనివల్ల అక్కడ డేటా తీసుకొని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ఫెక్షన్ రేటును బట్టి ఇది అంచనా వేస్తాం. ఈ సందర్భంలో డేటా అనేది ఇది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. దానివల్లనే శాస్త్రీయంగా ఒక అంచనాకు రావాలి.

ప్రశ్న: ప్రజల బాధ్యత ఎంత వరకు ఉంటుంది?

జవాబు: డబ్ల్యూ హెచ్ఓ ఏం చెబుతోందంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్ అని... భారతదేశం అంతా ఒకే విధానం ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి ఉపకరిస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా విధానాన్ని పద్ధతులను అనుసరించాలి. ప్రజల పాత్ర ఇందులో కీలకం. మిమ్మల్ని మీరు ఏలా నిర్వహించుకుంటారు... అన్నదాని మీద ఈ వైరస్ అనేది ఆధారపడుతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది... ఎవరికి వారు నాకు కూడా వర్తిస్తుందని శ్రద్ధ తీసుకోవాల్సిందే.

ప్రశ్న: సామూహికంగా డిస్ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉపకరిస్తుంది?

జవాబు: ఏ రకంగా జరుగుతున్నదన్న అంశాలు పరిశీలించాలి. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లు వైద్యులు చాంబర్ ను ప్రయోగశాలలో ఏరకంగా డిస్ఇన్ఫెక్షన్ చేస్తారో ఆ రకంగానే ప్రతి ప్రాంతంలోనూ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సమర్థమైన ఫలితాలు వస్తాయి.

ప్రశ్న: కరోనా పై అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి.?

జవాబు: డేటా సేకరణ దాని ఎనాలసిస్ ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కూడా నిపుణులు అనుభవంతో మాత్రమే చేయగలరు. సాధారణంగా దీన్ని సూత్రీకరించడం సాధ్యం కాదు. యాంటీబాడీస్ టెస్టులు వల్ల కమ్యూనిటీ గురించి తెలుస్తుంది. ఆర్.టి.పి.సిఆర్​ లో ఒక మనిషికి వైరస్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. యాంటీ బాడీస్, యాంటీజేన్ టెస్ట్ ల వల్ల కమ్యూనిటీ స్ప్రెడ్ అంచనా వేయడానికి వీలు ఉంటుంది. మొత్తం కమ్యూనిటీనంతటిని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ వైరల్ లోడ్ అవుతాయి. డబ్ల్యూహెచ్​వో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని గుర్తించేందుకు వీలవుతుంది. దానివల్ల నియంత్రణ కార్యక్రమాలను సొంతంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది.

ప్రశ్న: హై రిస్క్ గ్రూప్​లు, ఆ వయస్సు పరిమితిలో ఉన్నవారికి టెస్ట్ చేయడం మంచిదా?

జవాబు: ఇది చాలా మంచి పని. దీనివల్ల గ్రూప్లో ఉన్న వారికి బాగా రక్షించిన వారవుతారు. మీ యాక్షన్ వల్లే వైరస్​ ఉద్ధృతి పెరుగుతుందా, తగ్గుతుందా అన్న అంశం ఆధారపడి ఉంటుంది. మీరు రూపొందించుకునే విధానాలు దీనికి తోడ్పడతాయి. పెద్ద ఎత్తున జనం గుమి గూడడం మంచి పద్ధతి కాదు.

ప్రశ్న: లాక్ డౌన్ వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా?

జవాబు: ప్రపంచవ్యాప్తంగా ఆయా పరిస్థితులను బట్టి మంచి మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రధానంగా యువత ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేను యూత్ కదా నాకేం కాదు అన్న ధోరణి విడిచిపెట్టాలి. లాక్ డౌన్ విధించడంలో ఎకానమి, లైవ్లీ హుడ్, వైరస్ వ్యాప్తి అన్నింటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి.

ఇదీ చదవండి:

వైకాపా రాజ్యసభ సభ్యుల్లో 50% మందిపై తీవ్రమైన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.