విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో బలవంతపు భూసేకరణ చేస్తే ఉరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మామిడిపాలెంలో బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. పేదల డీఫారం పట్టా భూములు బలవంతంగా లాక్కోవాలని వైకాపా ప్రభుత్వ చూస్తోందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. 14 గ్రామాల్లో 1,452 ఎకరాల డీఫారం పట్టా భూములు ల్యాండ్ పూలింగ్ పేరుతో కాజేయాలని చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయపోరాటం చేస్తామని.. రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: