విశాఖపట్నం జిల్లా చోడవరంలో గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం, మాడుగుల క్లస్టర్స్ ఇన్విజిలేటర్లు, సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరయ్యారు.
సమావేశ నిర్వహణలో కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ అక్కడికి హాజరైన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు లేవని.. తామంతా కిక్కిరిసి కూర్చోవలసిన పరిస్థితి ఉందని వాపోయారు.
ఇదీ చదవండి: