విశాఖ పాడేరు ఏజెన్సీ మార్గాల్లో లాక్డౌన్ ప్రకటనతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లకుండా రహదారులకు అడ్డుగా అడుగడుగునా చెట్లు, బండలు రాళ్లు పేర్చి రాకపోకలను కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర రవాణాకు, అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పాడుతుంది. ఏవరికి వారే స్వచ్ఛందంగా లాక్డౌన్లో పాల్గొనాలని, ఇలాంటి ఏర్పాట్లు చేయవద్దని అధికారులే ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిత్యావసర సరుకులు అందించే జీసీసీ వాహనాలు, అంబులెన్సులు, పాల వ్యాన్లు ఆయా గ్రామాలకు చేరుకోవడం లేదు. జి.మాడుగుల మండలం గడుతూరు వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో గిరిజన కార్పొరేషన్ ద్వారా రేషన్ డిపోలకు వెళ్లే వాహనాలు నిలిచిపోతున్నాయి. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ రహదారులపై అడ్డంకులు తొలగించి వైద్య సేవలు, నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవీ చూడండి...