ETV Bharat / state

ఉత్సాహంగా సాగిన ఈనాడు క్రీడా పోటీలు - విశాఖలో ముగిసిన ఈనాడు క్రీడా పోటీలు

ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ - 2019 పోటీలు విశాఖలో ఘనంగా ముగిశాయి. ఖోఖో, కబడ్డీ, పరుగుపందెం, బ్యాడ్మింటన్​, వాలీబాల్​, చెస్​ విభాగాల్లో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

eenadu sports league completed in vizag
విశాఖలో ముగిసిన ఈనాడు క్రీడా పోటీలు-2019
author img

By

Published : Jan 7, 2020, 11:05 PM IST

ఉత్సాహంగా సాగిన ఈనాడు క్రీడా పోటీలు

విశాఖలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్​ లీగ్ ​- 2019 పోటీలు ఘనంగా ముగిశాాయి. ఖోఖో, కబడ్డీ, పరుగు పందెం, బ్యాడ్మింటన్​, వాలీబాల్​, చెస్​ విభాగాల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు ఏయూ ఫిజికల్​ బోర్డ్​ డైరెక్టర్​ ఎన్​. విజయమోహన్​, కబడ్డీ జిల్లా అసోసియేషన్​ కార్యదర్శి శ్రీనివాస్​, సీఎంఆర్​ అధినేత మావూరి వెంకటరమణ హాజరై... విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ యువకుల విభాగంలో బాసర కళాశాల, యువతుల విభాగంలో ఏఎస్​ రాజా మహిళా కళాశాల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. వాలీబాల్​ యువకుల విభాగంలో ప్రభుత్వ జూనియర్​ కళాశాల, యువతుల విభాగంలో బాసర కళాశాల జట్లు గెలుపొందాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈనాడు చేస్తున్న కృషికి భవిష్యత్​లోనూ సహకారం ఉంటుందని సీఎంఆర్​ అధినేత అన్నారు.

ఇదీ చదవండి:

కర్నూలులో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.