విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో డ్వాక్రా మహిళలు వాగుదాటే క్రమంలో ఓ మహిళ వాగులో చిక్కుకుపోయింది. గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని డ్వాక్రా మహిళలు రుణమాఫీ కోసం ప్రతీ ఒక్కరి బయోమెట్రిక్ కోసం సంబంధిత వెలుగు సీసీ కబురు పెట్టారు. దీంతో జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా మహిళలు ధారకొండకు బయలుదేరారు.
ధారకొండ సమీపంలోని కొంగపాకలు వద్దకు వచ్చేసరికి కొంగపాకలు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో మహిళలు చేయి చేయి పట్టుకుని వాగు దాటుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వాగులో చిక్కుకుపోయింది. తోటి మహిళలు ఆమెను కాపాడారు. వెలుగు సీసీ గ్రామాల్లోకి రాకుండా మమ్మల్ని ప్రధాన కేంద్రానికి రప్పించటం వల్లే ఈ సమస్య వచ్చిందని మహిళలు తెలిపారు.
ఇదీ చూడండి